వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట


Fri,October 4, 2019 12:18 AM

-ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
-భువనగిరిలో వయోవృద్ధులకు సన్మానం
భువనగిరి అర్బన్: వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ వయోవృదుల దినోత్సవం సందర్భంగా స్త్రీ, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ, ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని దివ్య ఫంక్షన్‌హాల్‌లో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని తక్కువ పింఛన్‌తో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ఎవరూ అడగకుండానే ఆసరా పిఛన్లను రెట్టింపు చేశారన్నారు. వృద్ధుల సంక్షేమానికి బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయించిదన్నారు. రానున్న రోజుల్లో యాదగిరిగుట్టతో పాటు దేవాలయాల్లో వద్ధులకు ప్రత్యేక దర్శనాల ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్టీసీ బస్సులో వృద్ధులకు రాయితీలు కల్పించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్త్తానన్నారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పింఛన్ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ వృద్ధులు తమ కుటుంబ సభ్యులను అర్థం చేసుకునే శక్తిని తెచ్చుకోవాలన్నారు. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాలి తప్ప కోర్టులు, కేసులు అంటూ పంతాలకు వెళ్లకూడదన్నారు. జిల్లాలో 32వేల మంది వృద్ధులకు రూ.79కోట్లు పింఛన్ అందిస్తున్నామన్నారు. అర్హులైనవారిని గుర్తించుటకు అధికారులు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

వయోవృద్ధులకు ప్రత్యేక రక్షణ..
వయోవృద్ధుల ప్రాణ, ఆస్తులకు పోలీస్‌శాఖ ప్రత్యేక రక్షణ కల్పిస్తుందని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007లో వచ్చిందన్నారు. ఇది వయోవృద్ధులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తుందన్నారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వృద్ధుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్డ్డన్ సెర్చ్‌లో ప్రత్యేకంగా వృద్ధుల ఆరోగ్య, స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. పెద్ద కుంటుంబాల్లో వృద్ధుల స్థితిగతులపైన తగాదాలు వస్తాయని, వారి కుటుంబ సభ్యులకు అవగాహన, కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు కలెక్టర్ అనితారామచంద్రన్ జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వయోవృద్ధులను శాలువాతో సన్మానించారు. స్త్రీ శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు వెంకటేశ్వర్‌రావు, సూరజ్‌కుమార్, రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహారావు, జిల్లా అధ్యక్షుడు బాలయ్యయాదవ్, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, యాదగిరిరెడ్డి, దశరథ, ఎం. నర్సింహారావు, జిల్లాలోని అన్ని మండలాల వయోవృద్ధుల అధ్యక్షులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...