ద్రవ జీవామృతంతో పత్తి పంటలో తెగుళ్ల నివారణ సులభం


Fri,October 4, 2019 12:17 AM

ఆలేరురూరల్ : పత్తి పంటలకు సోకుతున్న తెగుళ్ల నివారణకు ద్రవ జీవామృతాన్ని వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. గురువారం మండల పరిధిలోని మందనపల్లిలో పత్తి పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పత్తి పంటలకు రసం పీల్చే పురుగులైన పెనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామరపురుగులు వంటివి ఆశిస్తున్నట్లు తెలిపారు. వీటి వల్ల రైతులు ఆధైర్యపడొద్దన్నారు. రసాయనిక ఎరువులను పిచికారి చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 15రోజులకోసారి ద్రవజీవామృతంతోపాటు తగు మోతాదులో రసాయనిక క్రిమి సంహరక మందులను పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకటేశ్వర్‌రావు, సర్పంచ్ పాండరి, ఏడీ లావణ్య, ఏఈవో నాగర్జున, రైతులు రాము, నోముల చిన్న ఎల్లయ్య, బండి భిక్షపతి, కడకంచి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...