గీత కార్మికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి


Fri,October 4, 2019 12:16 AM

ఆలేరురూరల్ : తాటి చెట్టు ఎక్కే ప్రతి గీత కార్మికుడు ఖచ్చితంగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని ఆలేరు ఎక్సైజ్ శాఖ సీఐ టి.మాధవరావు అన్నారు. హరితహారంలో భాగంగా గురువారం మండలంలోని టంగుటూరులో తాటి విత్తనాలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలై, మృతి చెందుతున్నారన్నారు. అందుచేత వారి కుటుంబాలకు అండగా ఉండి ఆదుకునేందుకు ప్రభుత్వం అందించే ఎక్స్‌గేషియా రావడానికి ఖచ్చితంగా గీత కార్మికులు గుర్తింపు కార్డు కలిగి ఉండాలని తెలిపారు. గీత వృత్తిని ప్రోత్సహంచేందుకు ప్రభుత్వం హరితహారంలో ఈత, తాటి మొక్కలు అందజేస్తున్నారన్నారు. వీటిని చెరువు, కుంట కట్టలపై, సొసైటి భూముల్లో నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ షమీకుమార్, కానిస్టేబుల్ రంగయ్య, హిమాన్‌గౌడ సంఘం అధ్యక్షుడు నామాల కృష్ణామూర్తి, ఉపాధ్యక్షుడు రోశయ్య, సభ్యులు దూసరి కృష్ణ, పూజారి పరంధాములు,పాండు, రమేశ్, రవి, వెంకటేశ్, కందాల మల్లేశ్, సిద్ధులు, ఉప్పలయ్య, లింగం, రాములు, రాఘవేంద్ర, సత్తయ్య, శేఖర్, నాగేశ్, లక్ష్మయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...