చిన్నవయస్సులోనే అత్యంత ప్రతిభ


Fri,October 4, 2019 12:16 AM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : అతి చిన్నవయస్సులో రిషినాయక్ తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలో అత్యంత ప్రతిభ కనబర్చి వెండి పథకం సాధించడం గొప్ప విషయమని గ్రీన్‌గ్రోవ్ పాఠశాల చైర్మన్ అనీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హనుమాన్‌నగర్ గ్రీన్‌గ్రోవ్ పాఠశాలకు చెందిన బి .రిషినాయక్ గద్వాల్ జిల్లాలోని జోగులాంబలో నిర్వహించిన తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని వెండి పథకం సాధించాడు. పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చైర్మన్ పూలమాల, శాలువాతో రిషినాయక్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదవుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి మురళి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...