కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు


Fri,October 4, 2019 12:16 AM

మిర్యాలగూడ రూరల్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్‌కు ధీటుగా విద్యాబోధన జరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండలపరిధిలోని అవంతీపురం గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రీడోత్సవంలో గురువారం ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతం లో ఏ ప్రభుత్వం అందించని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేసి ఆంగ్లమాధ్యమంలో బోధన అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగా న్ని ఎంచుకొని అంతర్జాతీయ స్థాయి లో రాణించాలన్నారు. కార్యక్రమంలో గిరిజన గురుకులాల అడిషనల్ సెక్రటరీ నవీన్ నికోలస్, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, గిరిజన గురుకుల రీజినల్ కోఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు, రాష్ట్ర క్రీడల అధికారి రమేష్, ప్రిన్సిపాల్ సుధాకర్, పీడీలు లక్ష్మీనారాయణ, శోభన్, రాజ్‌కుమార్, మూనోతు రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...