అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు


Fri,October 4, 2019 12:15 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందజేస్తామని కలెక్టర్ అనితారామచంద్రన్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన అక్రిడిటేషన్ కమిటీ రెండో దఫా సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని, జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ కార్డులు అందించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు, అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు గొట్టిపర్తి భాస్కర్ కోరగా.. ఆమె పై విధంగా స్పందించారు. ప్రచురిస్తున్న పేజీల సంఖ్యతో సంబంధం లేకుండా కార్డులు జారీ చేయాలని విన్నవించారు. మండల కేంద్రాల్లో ఒకే పత్రిక నుంచి ఇద్దరిద్దరు జర్నలిస్టులు పని చేస్తున్నారని, వారికి కూడా న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిన విషయాన్ని వివరించారు. అదేవిధంగా ఐదుగిరికి మించి డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యాదాద్రికొండపై పని చేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌ను కోరుతూ అనుమతులు తీసుకుంటామన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పని చేస్తున్నారని, వారికి కూడా కార్డులు ఇవ్వాలని ఐజేయూ జాతీయ నాయకుడు యంబ నర్సింహులు కోరగా.. ఆమె సానుకూలంగా స్పందించారు. రెండు మూడు రోజుల్లో కార్డులు జారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి, డీపీఆర్‌వో జగదీశ్, కమిటీ సభ్యులు కొల్పుల వివేక్, వెల్మినేడు జహంగీర్, సున్నం నర్సింహ, రాగి చంద్రశేఖర్, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...