పల్లెలో పురోగతి


Thu,October 3, 2019 12:00 AM

-30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఫలితం
-జోరుగా సాగుతున్న పారిశుధ్యం, హరితహారం పనులు
-ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు

యాదగిరిగ్టుట, నమస్తేతెలంగాణ : ప్రతి పల్లెలు పచ్చనిహారం కావాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు, మహబూబ్‌పేట, పెద్దకందుకూరు, తాళ్లగూడెం, బాహుపేట గ్రామాల్లో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న 30 రోజుల ప్రణాళిక పనులు, మొక్కల పెంపకం, పారిశుధ్య పనుల్లో పురోగతి వంటి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. ఊరూరా, వాడవాడ కలియతిరిగి జరిగిన పనులు తీరును పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాళీ ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధాబీరయ్య, ఎంపీడీవో పైళ్ల జయప్రకాశ్‌రెడ్డి, సర్పంచులు తోటకూరి బీరయ్య, ఆరె స్వరూపామల్లేశ్ గౌడ్, రాములు, కుండే పద్మానర్సయ్య, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మకంగా కార్యాచరణ..
రాజాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ బుధవారం మండలంలోని వి విధ గ్రామాల్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా సంఘం సభ్యులు వీధులను పరిశుభ్రం చేసి బతుకమ్మ ఆటలను ఆడారు. రాజాపేట, బొందుగుల, నెమిల, రఘునాథపురం గ్రామాల్లో పాడుబడి న ఇండ్లను కూల్చివేయించారు. మండల ప్రత్యేకాధికారి మం క్తనాయక్, ఎంపీడీవో రామరాజులు సింగారం, కొత్తజాల, బేగంపేటలో గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామ ప్రత్యేకాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పరిశుభ్రత..
ఆత్మకూరు(ఎం) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ ప్రత్యేకాధికారులు, సర్పంచులు పరిశుభ్రత పనులు చేపట్టారు. మండలంలోని పోతిరెడ్డిపల్లిలో వీధుల వెంట ఉన్న కలుపు మొక్కలను తొలగించి మొక్కలు నాటగా కొరటికల్‌లో ప్రధాన రోడ్డు వెంట ఉన్న సర్కారు తుమ్మ చెట్లను తొలగించారు. ఆత్మకూరు(ఎం)లో కూలిన ఇండ్లతో పాటు మురుగుకాల్వలను శుభ్రపర్చారు. మొరిపిరాల, రాఘవాపురం, ఉప్పలపహాడ్ తదితర గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ వీధుల వెంట ఉన్న ప్లాస్టిక్ కవర్లతో పాటు ఇతర చెత్తను ఏరివేసి శుభ్రపర్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తండా మంగమ్మ, జడ్పీటీసీ నరేందర్‌గుప్తా, ఎంపీడీవో ఆవుల రాములు, మండల పంచాయతీ అధికారి అనంతలక్ష్మి, ఎంపీటీసీ యాస కవిత, మర్యాల వెంకటేశ్వర్లు, సర్పంచులు సామతిర్మల్‌రెడ్డి, కోల సత్తయ్యగౌడ్, దొండ కమలమ్మ, గనగాని మాధవీమల్లేశంగౌడ్, ఆకుల సరిత, పంచాయతీ కార్యదర్శులు కళ్యాణ్‌రావు, శేఖర్, గ్రామ ప్రత్యేకాధికారులు శిల్ప, గోవర్ధన్, సరిత, ఉప సర్పంచులు నవ్య, గీత పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..
తుర్కపల్లి : ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్ అన్నారు. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని నాగాయపల్లిలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు సింగిరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారికి ఇరువైపుల 1000 మొక్కలను నాటి వాటికి దాతల సహకారంతో అందజేసిన ట్రీ గార్డులను అమర్చారు. కొండాపూర్‌లో రోడ్డు వెంట ఉన్న చెత్తా చెదారం తొలగించి సర్పంచ్ డొంకెన మల్లేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. తిరుమలాపూర్‌లో సర్పంచ్ నామసాని సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి పారిశుధ్య పనులు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, ఎంపీడీవో ఉమాదేవి, కో-ఆప్షన్ ఫోరం జిల్లా అ ధ్యక్షుడు రహమత్‌షరీఫ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు సింగిరెడ్డి నరసింహారెడ్డి, ఎంపీటీసీలు కొమటిరెడ్డి సంతోషభాస్కర్‌రెడ్డి, గిద్దె కరుణాకర్, సర్పంచ్ నిర్మల, సిం గం వెంకటేశం, గ్రామస్తులు, ప్రత్యేకాధికారులు ఉన్నారు.

ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి..
మోటకొండూర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో వీరస్వామి తెలిపారు. బుధవారం మండల కేంద్రంతో పాటు కాటేపల్లి, చందేపల్లి, చామాపూర్ గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు పారిశుధ్యంలో భాగంగా ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు. నాంచారిపేటలో ఎంపీపీ, ఎంపీడీవోలు గ్రామప్రజలతో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేయించారు. కొండాపూర్‌లో గ్రామస్తులకు ఉపసర్పంచ్ తడిపొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గిరిబోయినగూడెంలో రాణువ నర్సింహారావు ప్రభుత్వ భవనాలకు రంగులను వేయించారు. ఇక్కుర్తిలో సర్పంచ్ చామకూర అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలుపు మొక్కలను తొలగించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ గీత, డీటీ సత్యనారాయణ, ఆర్‌ఐ యాదగిరి, సర్పంచులు మంత్రి రాజు, దూదిపాల మున్నీజలెంధర్‌రెడ్డి, పోతిరెడ్డి స్వప్నాస్కైలాబ్‌రెడ్డి, సిరిపురం నర్మద, పైళ్ల వినోదాసుధాకర్‌రెడ్డి, ఆడెపు విజయస్వామి, గంగపురం గీత, పామిశెట్టి మేరీసింహారాయలు, వేముల పాండు, పన్నాల బాయమ్మ, సుదగాని సత్తమ్మ, మారబోయిన బాలసిద్ధులు, కార్యదర్శిలు నందాల సాయి, బాల్ద భవాని, జావిద్, స్వాతి, ప్రత్యుష, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

గుండాల : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ ప్రత్యేకాధికారులు, సర్పంచులు పారిశుధ్య పనులతో పాటు ప్లాస్టిక్ కవర్లను ఏరివేశారు. ప్లాస్టిక్‌ను తొలగిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు.

కొనసాగుతున్న కార్యాచరణ..
బొమ్మలరామారం : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ అమల్లో భాగంగా బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించి, మొక్కల సంరక్షణ చేపట్టారు. మండలంలోని చీకటిమామిడి, నాగినేనిపల్లి, మైలారం, సోలిపేట, రంగాపూర్ గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల కలుపు మొక్కలు తొలగించి, నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా చీకటిమామిడిలో వైస్‌ఎంపీపీ గొడుగు శోభాచంద్రమౌళి మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునే సదావకాశం 30 రోజుల ప్రణాళిక కార్యాచరణతో సాధ్యమవుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఇన్‌చార్జి ఎంపీడీవో శేషాద్రి, సర్పంచులు మచ్చ వసంతాశ్రీనివాస్‌గౌడ్, అరుణాఆనంద్‌చారి, గణేశ్, ధీరావత్ మంజులరాజన్‌నాయక్, పూడూరి నవీన్‌గౌడ్, రామిడి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు, పద్మాపాచ్యానాయక్, లతానర్సింహ, మడిగె నర్సింహ, నాయకులు నర్సింహ, శ్రీనివాస్‌రావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న పారిశుధ్యం..
ఆలేరురూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తూర్పుగూడెంలో సర్పంచ్ వంగాల శ్రీశైలం స్టాండింగ్ కమిటీ మెంబర్లతో కలిసి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా కందిగడ్డతండాలో సర్పంచ్ కేతావత్ సుజాతావీరయ్య నాయక్, కో-ఆప్షన్ సభ్యులు, రవీనాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. వివిధ గ్రామాల్లో గ్రామ ప్రత్యేకాధికారులు, సర్పంచులు పారశుధ్య పనులు నిర్వహించి, పాడుబడిన ఇండ్లను కూల్చివేయించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, గ్రామ పత్యేకాధికారులు, పంచాయతీ కార్యదరుక్శలు, గ్రామ కో-ఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...