మద్యం షాపులపై మహిళల దాడులు


Wed,October 2, 2019 11:50 PM

వలిగొండ : గ్రామ పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాపులపై మహిళలు దాడులు చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన మండలంలోని అరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మత్స్యగిరిగుట్టలో బుధవారం చోటు చేసుకుంది. అక్టోబర్ 1 నుంచి బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయించవద్దని సర్పంచ్ చిట్టెడి జయమ్మాజనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామసభ తీర్మానానికి వ్యతిరేకంగా మద్యం అమ్ముతున్న షాపులపై సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు దాడులు నిర్వహించి రూ.10 వేల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...