ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి


Wed,October 2, 2019 11:50 PM

భూదాన్‌పోచంపల్లి : పర్యావరణానికి హాని కలిగించడంతోపాటు భవిష్యత్‌లో మానవ మనుగడను ప్రశ్నార్థకం చేయనున్న ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలో స్వచ్ఛత హే సేవా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడటాన్ని నిషేధించాలి అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డితోపాటు మున్సిపల్ కమిషనర్ బాలశంకర్, మేనేజర్ నల్ల బాలాజీ, మాజీ ఎంపీటీసీ రవీందర్, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, మహిళా సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

కార్యాలయ సిబ్బందికి రూ.500 జరిమానా..
చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది భిక్షపతికి బుధవారం రూ.500 జరిమానా విధించారు. ప్లాస్టిక్ నిర్మూలన పాటించకపోవడం పట్ల ఎంపీడీవో రాకేశ్‌రావు జరిమానా వేశారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న గాంధీ జయంతి వేడుకలకు ప్లాస్టిక్ కవర్‌లో పూలమాల తేవడంతో జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...