మొక్కు తీర్చుకున్న చంద్రం


Wed,October 2, 2019 11:49 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు మంత్రిపదవి రావడంతో ఆయన అభిమాని సిందే చంద్రం యాదగిరిగుట్టకు పాదయాత్రతో వచ్చి లక్ష్మీనర్సింహ స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. హరీశ్‌రావుకు మంత్రి పదవి రావాలని మొక్కిన చంద్రం గత రెండు రోజుల కిందట సిద్దిపేట జిల్లా నుంచి పాదయాత్రగా యాదగిరిగుట్ట బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బుధవారం యాదగిరిగుట్టకు చేరుకొని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పాదయాత్రగా వచ్చిన చిందే చంద్రంకు స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...