ముమ్మరంగా ప్రత్యేక కార్యాచరణ


Wed,October 2, 2019 12:06 AM

చౌటుప్పల్ రూరల్ : 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం మండలపరిధిలోని అంకిరెడ్డిగూడెం, ఎల్లగిరి, పంతంగి, నేలపట్ల, పీపల్‌పహాడ్ తదితర గ్రామాల్లో మంగళవారం ముమ్మరంగా కొనసాగాయి.ఆయా గ్రామా ల్లో శ్రమదానం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని పాత ఇంటినిర్మాణాలను, మట్టికుప్పలను తొలగించారు.అంతేకాకుండా రోడ్లకు ఇరువైవులా మొక్కలు నాటా రు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో రాకేశ్‌రావు, డీటీ మమ త, ఆర్‌ఐ సైదిరెడ్డి, సర్పంచ్‌లు ముద్దం సుమిత్ర సత్తయ్యగౌడ్, రిక్కల ఇందిరా సత్తిరెడ్డి, బాతరాజు సత్యం, చౌట వేణుగోపాల్ గౌడ్, చీరిక రాణి, గ్రామాల ప్రత్యేకాధికారులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంస్థాన్‌నారాయణపురంలో..
సంస్థాన్‌నారాయణపురం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక పనులు ముమ్మరంగా కొనసాగుతున్నవి. మంగళవారం అల్లందేవిచెరువు గ్రామం లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించడంతో పాటు పురాతన ఇండ్లను కూల్చి వేశారు. అనంతరం హరితహారంలో భాగంగా సర్పంచ్ సుర్వి యాదయ్య గౌడ్ మొక్కలు నాటారు. చిమిర్యాలలో సర్పంచ్ జైపాల్‌రెడ్డి పాల్గొని రోడ్డు పక్కను ఉన్న కలుపు మొక్కలను తొలగించి అక్కడ మొక్కలు నాటారు. అలాగే వెంకంబావితండాలో సర్పంచ్ పానుగొతు పాండురంగా పాల్గొని రోడ్డుపైన వేసిన ప్లాస్టిక్ చెత్తను తొలగించి అక్కడ గ్రామస్తులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు, కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేటలో..
రామన్నపేట : గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పారిశుధ్యాన్ని మెరుగుపరచడం ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గుత్తా నర్సింహరెడ్డి పిలుపు నిచ్చారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మంగళవారం నిధానపల్లిలోని పరిసరాలను డోజర్ సహాయంతో శుభ్రం చేయించారు. డోజర్ వెళ్లలేని వీధులలో ప్రజలు శ్రమదానం చేశారు. ప్రధాన రహదారివెంట మొక్క లు నాటారు. లకా్ష్మపురంలో పారిశుధ్యాన్ని మెరుగు పరిచే పనులు చేపట్టారు. అనంతరం 26రోజులుగా జరిగిన పనులపై గ్రామస్తులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మిగిలిన రోజుల్లో చేపట్టవలసిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారు లు ఎండీ ఇబ్రహీం, ఎంపీపీ అంజయ్య సర్పంచ్ ఉప్పు ప్రకాశ్, ఉపసర్పంచ్ బత్తిని మహేశ్, పంచాయతీ కార్యదర్శులు జ్యోతి, రమేశ్, వార్డుసభ్యులు, గ్రామ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...