నేషనల్ ఓటర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి


Fri,September 20, 2019 11:47 PM

భూదాన్‌పోచంపల్లి : ప్రతి ఓటరు తన ఓటరు కార్డులో ఎమైనా తప్పులు ఉన్నాయా..? అనే విషయాన్ని తెలుసుకోవడానికి నేషనల్ ఓటర్ వెరిఫికేషన్ పోగ్రామ్‌లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని తహసీల్దారు గుగులోతు దశరథ నాయక్ అన్నారు. శుక్రవారం మండల తహసీల్దారు కార్యాలయంలో ఎన్‌వీఎస్‌పీ కార్యక్రమంపై తహసీల్దార్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌నెట్‌లో WWW.NVSP.INలోకి వెళ్లి మన ఓటరు నమోదును చూసుకోవచ్చని తెలిపారు. మన ఫోన్ నెంబర్‌నే పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తే మన ఫోన్‌కు ఓటీపీ వస్తుందని, దానిని జనరేట్ చేస్తే మన ఓటరు ఐడీ వస్తుందని తెలిపారు.

దానిలో పేరు, తండ్రి పేరు, వయస్సు తప్పుగా ఉంటే సరిచేసుకోవచ్చని, ఫొటో బాగా లేకపోతే సరిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తప్పు ఉంటే తప్పు ఉందని టిక్ చేయడంతోపాటు ఫొటోను కూడా మనం అప్‌లోడ్ చేస్తే ఈ విషయం తహసీల్దారు ఫోర్టుకు వస్తుందని, దానిని తహసీల్దారు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి ఓటరు సరిచేయాలనుకునే అంశాలను పరిశీలించి అంగీకారం తెలుపుతారని వివరించారు. ఈ విధంగా ప్రతి ఓటరు తన ఓటరు కార్డును సరిచేసుకోవచ్చని, దీనికి జాతీయ ఎన్నిక కమిషన్ మనకు అవకాశం కల్పించిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి అధికారులకు కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శోభ, నరేందర్‌చారి, వీఆర్వోలు రాఘవేందర్, రాములు, నర్సింహ, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...