యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి


Fri,September 20, 2019 11:47 PM

భూదాన్‌పోచంపల్లి : గ్రామీణ యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గత మూడు రోజులుగా మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలో కొప్పుల దామోదర్‌రెడ్డి స్మారకార్థంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు గురువారం రాత్రి ముగిశారు. ఈ సందర్భంగా విజేతలకు ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మొదటి స్థానంలో సూర్యాపేటకు చెందిన జట్టు విజేతగా నిలువగా.. రెండో స్థానంలో ఇంద్రియాల కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తుందన్నారు. క్రీడల వల్ల మానసికోల్లాసమే కాకుండా శారీర దారుఢ్యం బలపడుతుందన్నారు. ఇక స్నేహాభావంతో అందరూ కలిసిమెలిసి ఉండేలా క్రీడలు ఉపయోగపడుతాయన్నారు. 1983లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మృతి చెందిన కొప్పుల దామోదర్‌రెడ్డి విగ్రహం పాఠశాలలో ఏర్పాటు చేయడంతోపాటు ఆయన పేర ప్రతియేటా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ తరహా ఆచారం రాష్ట్రంలో ఎక్కడా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నిజంగా కొప్పుల దామోదర్‌రెడ్డి చిరస్మరణీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు కోట మల్లారెడ్డి, కందాడి సుధాకర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ దొడ్డి అలివేల సుదర్శన్, ఎంపీటీసీ మొగిలిపాక యాదగిరిని జిల్లా క్రికెట్ కమిటీ ఉపాధ్యాయుడు నగేశ్, మాజీ సర్పంచ్ బండి కృష్ణ, మాజీ ఎంపీటీసీ మొగిలిపాక సంతోశ్, నాయకులు నోముల మాధవరెడ్డి, చింతల రామకృష్ణ, పెద్దిరెడ్డి యాదగిరి, సింగిల్ విండో డైరెక్టర్ వారాల యాదిరెడ్డి, కొప్పుల లింగారెడ్డి, ఉపసర్పంచ్ ఉడుతల సాయిరామ్ యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గరిసె జంగయ్య, వార్డు సభ్యుల బద్దం జయ రాజేశ్వర్‌గౌడ్, చింతల ఉపేందర్, ఎర్ర రమ, శివగౌడ్, నక్క లావణ్య నరేశ్, రేవెల్లి వెంకటమ్మామారయ్య, మొగిలిపాక లింగస్వామి, పెద్దిరెడ్డి విజయ వినోద్‌కుమార్, దారావత్ రవినాయక్, వంగేటి బాల్‌రెడ్డి, చింతల రామకృష్ణ, పాలెం శివకృష్ణగౌడ్, రేవెల్లి వెంకటేశం, మొగిలిపాక సంతోశ్ పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...