పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం


Fri,September 20, 2019 11:46 PM

బీబీనగర్ : మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ అన్నారు. పోషకాహార మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జైనపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని గర్భిణులకు పోషకాహారాలపై తీసుకోవాల్సిన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, సర్పంచ్ మొరుగాడి బాల మల్లేశ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, నాయకులు తంతరపల్లి అంజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పోషణ్ అభియాన్‌ను సద్వినియోగం చేసుకోవాలి..
భూదాన్‌పోచంపల్లి : పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అంతమ్మగూడెం గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించడంతోపాటు చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ గర్భిణులకు, బాలింతలకే కాకుండా చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం లోపంతో వచ్చే వ్యాధులను జయించడానికి తగిన పోషక పదార్థాలు తీసుకోవాలని, పేదలకు అవి అందడంలేదనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఈ కార్యక్రమం ద్వారా వారికి అందిస్తుందన్నారు. అనంతరం గ్రామంలోని పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలశంకర్, ఎంపీవో పైళ్ల జనార్దన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ వస్పరి పారిజాత మహేశ్, ఉపసర్పంచ్ గుమ్మి జయానరేందర్‌రెడ్డి, జేపీఎస్ సుభాశ్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ అంజమ్మ, అంగన్‌వాడీ కార్యకర్త గుమ్మి పద్మ, వార్డు సభ్యులు వస్పరి వెంకటేశం, జంగమ్మ, వల్లూరి ఆండాలు, రావుల సంధ్య, గుమ్మి దామోదర్‌రెడ్డి, వల్లూరి జంగయ్య పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...