బీబీనగర్ : ఊరి కోసం సేవ చేసేందుకు గతంలో ఏ సర్పంచ్‌కు రాని అదృష్టం వచ్చిందని.. గ్రామాభివృద్ధికి అందరూ పాటుపడాలని అన్నంపట్ల సర్పంచ్ బొక్క వసుమతీజైపాల్రెడ్డి అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆమె శ్రమదానం, పాత ఇండ్ల నిర్మాణాలను కూల్చివేత కార్యక్రమాలు చేపట్టారు. రాఘవాపురం గ్రామంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ ప్రణాళిక పనులను పరిశీలించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కొండమడుగులో ఎంపీడీవో శ్రీవాణి పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.