విద్యార్థులు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి


Fri,September 20, 2019 12:03 AM

భూదాన్‌పోచంపల్లి : ఇంజినీరింగ్ విద్యార్థులు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని ఆగ్‌మెంటెండ్ బైట్ మేనేజింగ్ డైరెక్టర్ బి.రాధాకృష్ణ అన్నారు. గురువారం మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామంలోని ప్రముఖ విద్యా సంస్థ విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్త టెక్నాలజీ నైపుణ్యం - విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ హాజరై మాట్లాడుతూ నేడు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతుందో విద్యార్థుల మేథాశక్తిని కూడా అంతగా పెంపొందించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఆగ్‌మెంటెండ్ రియాల్టీపై విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఈవో బోయపాటి శ్రవణ్‌కుమార్, ప్రిన్సిపాల్ జి.దుర్గాసుకుమార్, హెచ్‌వోడీ జి.రాజావిక్రమం, డీన్‌లు ఎన్.మురళీకృష్ణ, డీవీ చౌదరి, ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ అక్షర, విద్యార్థులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...