ఎలక్టర్ వెరిఫికేషన్ ప్రోగాంను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి


Thu,September 19, 2019 12:34 AM

భువనగిరి, నమస్తేతెలంగాణ : ఎలక్టర్ వెరిఫికేషన్ పోగ్రాంను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. కలెక్టర్ బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ రమేశ్, డీఆర్‌వో వెంకట్‌రెడ్డితో సమావేశమై ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఎలక్టర్ వెరిఫికేషన్ కార్యక్రమాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ఆన్‌లైన్ విధానం ద్వారా ఓటరు తమ ఓటు వివరాలు పరిశీలించుకుని సరిచూసుకోవడంతోపాటు 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించినట్టు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని నూరు శాతం ఓటర్లందరూ తమ ఓటు వివరాలు పరిశీలించుకోవాలని, ఓటు హక్కు లేనిచో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అధికారులందరూ తమ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ ఓటు వివరాలను పరిశీలించుకోవడంతోపాటు ఓటు హక్కు లేని వారందరూ తమ వివరాలు నమోదుకై చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ శాఖల సిబ్బంది కూడా ఓటు హెల్ప్‌లైన్ యాప్‌పై అవగాహన కలిగి ఉండాలని, తమ కుటుంబ సభ్యుల ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, తద్వారా జిల్లాలో నూటికి నూరుశాతం ఓటర్లు తమ ఓటు వివరాలను సరిచూసుకుని ఎలక్టర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఈనెల 1 నుంచి వచ్చే నెల 15 వరకు అవకాశం కల్పించినందున ప్రతిఒక్కరూ సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా 2019 జనవరి 1 నాటికి 18 ఏండ్ల వయస్సు, ప్రస్తుతమున్న ఓటరు జాబితాలో వివరాలు, ఇంటిలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నది.. లేనిది ఓటర్లలో వలసలు వెళ్లడం, మరణించిన వారిని తొలగించడంతోపాటు కుటుంబంలో దివ్యాంగ ఓటర్లు ఉన్నచో వారి వివరాలు నమోదు చేయడం ప్రస్తుత పోలింగ్ కేంద్రం విషయాల్లో ఏమైనా సలహాలు, సూచనలు చేయడం వంటి సదావకాశం ఎన్నికల సంఘం కల్పించినట్టు తెలిపారు. అవసరాన్ని బట్టి సంబంధిత వీఆర్‌వో, ఏఈఆర్‌వో, బీఎల్‌వోలను సంప్రదించడంతోపాటు ఈఆర్‌వో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఓటరు వెరిఫికేషన్ సెంటర్‌ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, రాజకీయ వేత్తలు, సర్పంచ్‌లు, స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతగా ఓటర్లకు అవగాహన కలిగించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...