ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి


Thu,September 19, 2019 12:33 AM

తుర్కపల్లి: గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములై ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. బుధవారం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తుర్కపల్లి మండలం వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, దత్తాయిపల్లి గ్రామాలను ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులపై ఆరా తీశారు. వాసాలమర్రిలో శిథిలమైన ఇండ్లను తొలగించగా ఈ పనులను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ప్రభుత్వం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నదన్నారు. మన గ్రామాలను మనమే బాగు చేసుకోవాలన్నారు. యువత, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి గ్రామాల్లో శ్రమదానం చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పోగుల ఆంజనేయులు, జక్కుల శ్రీవాణి వెంకటేశ్, ఎంపీటీసీలు పలుగుల నవీన్‌కుమార్, గిద్దె కరుణాకర్, గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...