నిధుల దుర్వినియోగంపై అధికారులకు ఫిర్యాదు


Wed,September 18, 2019 12:19 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆత్మకూరు మండలం కాలువపల్లి గ్రామ సంఘబంధం అధ్యక్షురాలు నిధులు దుర్వినియోగం చేసిందని గ్రామంలోని సంఘ బంధం సభ్యులు జిల్లా అధికారులకు మంగళవారం పంపిన వినతిపత్రంలో పేర్కొన్నారు. కాలువపల్లికి చెందిన వరలక్ష్మి, జనచైతన్య, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, రాజ్యలక్ష్మి సంఘాల సభ్యులు పల్సం లావణ్య, సూదగాని పద్మ, పల్సం వరమ్మ, బీమగాని మంజుల, పంజాల సుమతి, పెండ్లి విమలమ్మ, భీమగాని కలమ్మ, పలసం పుష్పమ్మ, బద్దం అంజమ్మ, పలసం సువర్ణ, సూదగాని సువర్ణ, తుమ్మల సంధ్య తదితరులు ఓ ప్రకటన విడుదల చేశారు. తమ డబ్బులను పల్సం పద్మ వాడుకున్నదని వారు ఆరోపించారు. లెక్క చూపించలేదని అడిగినందుకు తప్పుడు కేసులు పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ. 1, 75, 000 వాడుకుని రూ. 50,000 వడ్డీ కట్టిందని వారు వివరించారు. మిగతా డబ్బులు కట్టమని నిలదీసిన పాపానికి మాపై అక్రమంగా కేసులు నమోదు చేయించిందని చెప్పారు. గ్రామ పెద్ద మనుషులను ఆమె అసభ్య పదజాలంతో దూషించిందన్నారు. పైగా అసత్య ఆరోపణలు చేయించటానికి కొంత మంది మీడియా ప్రతినిధులను వాడుకున్నదని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లో కూడా మీడియా ప్రతినిధులు ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. తప్పుడు కేసులు పెట్టించిన పద్మపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ కే. నారాయణరెడ్డిని కోరారు. సంఘం బందం డబ్బులు వాడుకోవడమే కాకుండా అన్యాయంగా గ్రామ పెద్దలు దూషించినట్లు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. పద్మను గ్రామ పెద్ద మధుసూదన్‌రెడ్డి ఎప్పుడూ దూషించలేదని చెప్పారు. పెద్ద మనుషులు ఎలాంటి తప్పు చేయలేదని, జరిగిన అన్యాయంపై పద్మను అడిగారే తప్ప ఎక్కడా అసభ్యకరంగా ప్రవర్తించలేదన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...