పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి


Wed,September 18, 2019 12:19 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ జి. రమేశ్ కోరారు. వచ్చే నెల ఒకటి నుంచి పత్తి మార్కెటింగ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ తన చాంబర్‌లో మార్కెటింగ్, వ్యవసాయ, తూనికలు, కొలతలు, అగ్నిమాపక, సీసీఐ అధికారులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం ఏర్పాటు చేసి ముంద స్తు ఏర్పాట్లపై సమీక్షించారు. పత్తి కొనుగోలు ఆపరేషన్స్ సజావుగా జరుగాలని ఆయన వివిధ శాఖల అధికారుల కు ఆదేశించారు. తూనికలు, కొలతల అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాంపింగ్ సర్టిఫికేషన్ చేపట్టాలన్నారు. గత ఏడాది పత్తి క్వింటాల్‌కు మద్ద తు ధర 5,450 నిర్ణయించగా, ఈసారి క్వింటాల్‌కు రూ. 5,550 నిర్ణయించడం జరిగిందన్నారు. ఈసారి జిల్లాలో 8,77,590 క్వింటాళ్ల పత్తి దిగుబడి రానున్నట్లు అధికారులు అంచనా వేసి ఆమేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టారన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ అధికారి సబిత, సీసీఐ మేనేజర్ ప్రవీణ్, అగ్నిమాపక అధికారి అశోక్, రవాణా, తూనికలు, కొలతలు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ల సరఫరాకు డీలర్లు ముందుకురావాలి
లాభాపేక్ష లేకుండా కమ్యూనిటీ అవసరాల నిమిత్తం ట్రాక్టర్ల సరఫరా కోసం డీలర్లు ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ రమేశ్ కోరారు. గ్రామ పంచాయతీల 30రోజుల కార్యాచరణ ప్రణాళిక, పారిశుధ్య చర్యల్లో భాగంగా డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, ట్రాన్స్‌ఫోర్టు తదితర శాఖల అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ తన చాంబర్‌లో మంగళవారం ట్రాక్టర్ డీలర్లతో సమావేశమై చర్చించారు. జిల్లాలో 427 గ్రామ పంచాయతీలకు తొలి విడుతగా 200ట్రాక్టర్లు అవసరం ఉన్నందున డీలర్లు లాభాపేక్ష లేకుండా ఉత్పాధిక ధరకే 35హెచ్‌పీ ట్రాక్టర్లు విక్రయించాలని ఆయన సూచించారు. గ్రామ ప్రజల సామూహిక అవసరంగా భావించి, సామాజిక బాధ్యతగా ట్రాక్టర్ల డీలర్లు ముందుకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కంపెనీల ప్రధాన డీలర్లతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని డీలర్లు ఈ సందర్భంగా జేసీకి వివరించారు. ఈ సమావేశంలో డీలర్లు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...