పక్కాగా రిజిస్ట్రేషన్లు


Mon,September 16, 2019 11:11 PM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : చౌటుప్ప ల్ సబ్‌రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో అత్యం త పక్కాగా రిజిస్ట్రేషన్లు చేపడుతున్నామని సబ్‌రిజిస్ట్ట్రార్ ఆనంద్‌బాబు తెలిపారు. సబ్‌రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయించి మరుసటి రోజు డాక్యుమెంట్లను ఇస్తున్నామన్నా రు. ఈ క్రమంలో ఏమైనా మిగిలిపోయి న డాక్యుమెంట్లుంటే పూర్తిచేసేందుకు సెలవు రోజుల్లో కూడా వచ్చి పనిచేస్తున్నామన్నారు. ఎలాంటి ఫైరవీలకు తావులేకుండా అత్యంత నిఘా మధ్యన రిజిస్ట్రేష న్లు జరుపుతున్నామన్నారు. సెలవు రోజు ల్లో పనిచేస్తే ఎందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించడం సరైందికాదన్నారు. నాపై ఆరోపణలు చేయడం కాదని..రుజువులుంటే జిల్లా రిజిస్ట్ట్రార్ కానీ ఐజీకాని తెలుపవచ్చని తెలిపారు. అప్పుడు వారు నిజాలు నిగ్గుతేల్చి ఏవరిపైనైనా శాఖపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. తనపనిని తాను సజావుగా చేసుకునేందు కు అందరూ సహకరించాలని తెలిపారు. తనను భయబ్రాంతులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. ఇటీవల రెండో శనివా రం కూడా పెండింగ్‌లో ఉన్న డాక్యుమెం ట్లు పూర్తిచేసేందుకు వచ్చానని తెలిపారు. ఇదే విషయంపై ప్రతి ఒక్కరికీ వివరణ కూడా ఇచ్చానన్నారు. అంతా పద్ధ్దతి ప్ర కారమే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
క్రయ, విక్రయదారులు వచ్చాకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు నేరుగా డాక్యుమెంట్లు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా ప్రలోభ పెడితే తనకు వెంటనే తెలియజేయాలని, అలాంటి వారి మాయలో ప్రజలు పడొద్దని విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరా నిఘాలోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, రిజిస్ట్రేషన్ ప్ర క్రియ మొత్తం అత్యంత పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...