ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి..


Sun,September 15, 2019 11:20 PM

గుండాల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి సాధిస్తున్నాయని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. ఆదివారం మండలం పరిధి తుర్కలశాపురం గ్రామాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి 30 రోజుల ప్రణాళికలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గ్రామంలో జరుగుతున్న పారిశుధ్యం, ఇంకుడు గుంతల ఏర్పాటు, హరితహారంలో భాగంగా మొక్కలు నాటటాన్ని పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రధాన వీధుల్లో తిరుగుతూ సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు ప్రగతి సాధించాలంటే 30 రోజుల ప్రణాళికలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయం ముందుకెళ్లాలన్నారు. అలాగే ప్రజలను భాగస్వాములను చేసి గ్రామాల ప్రగతికి బాటలు వేయాలన్నారు. 30 రోజుల ప్రణాళిక అమలులో అధికారులు ఎలాంటి అలసత్వం చూపకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలోని పురాతన గోడల తొలిగింపు, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. హరితహారం, విద్యుత్ దీపాల ఆధునికీకరణపై దృష్టి సారించాలన్నారు. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములైనప్పుడే గ్రామాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కుల భిక్షమయ్య, ఆల్డా ఉమ్మడి జిల్లా డైరెక్టర్ ఇమ్మడి దశరథ, నాయకులు మల్లేశ్, ఓడపల్లి మధు, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, పంచాయతీ సెక్రటరీ నూరోద్దిన్, కారోబార్ శ్రీను, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మత్సగిరి, అనిల్, భాస్కర్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...