పారిశుధ్యంపై దృష్టి సారించాలి : జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి


Sun,September 15, 2019 11:20 PM

చౌటుప్పల్ రూరల్ : పచ్చదనం, పారిశుధ్యంపై దృష్టి సారించాలని, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలం పరిధి దేవలమ్మనాగారంలో నోసీ ల్యాబ్ సహకారంతో ఏర్పాటు చేసిన చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తర్వాత అదే గ్రామంలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి జరుగుతున్న పనులను పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై ఆరా తీశారు. అనంతరం జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పనుల్లో జాప్యం జరుగుతే సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, పంచాయతీకార్యదర్శులు బాధ్యత వహించాలన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళిక ప్రకారం పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 26 గ్రామాల్లోనే బీటీ రోడ్లు లేవన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

వాటి పరిష్కరానికి అవసరమైన నిధులు, పరికరాలు సైతం ప్రభుత్వం మంజూరు చేసిందని స్పష్టం చేశారు. దేవలమ్మ నాగారం గ్రామంలో కార్యాచరణ పనులు ముమ్మరంగా చేపట్టడం హర్షణీయమన్నారు. గ్రామంలో చేపడుతున్న పారిశుధ్యం, హరితహారంపై ఆయన ప్రశంసలు వ్యక్తం చేశారు. కొయ్యలగూడెంలోనూ పర్యటించి 30రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను పరిశీలించారు. గ్రామంలోని రోడ్డు వెంబడి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో రాకేశ్‌రావు, సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు సురిగి రాజమ్మ, జెల్ల ఈశ్వరమ్మ, సూపరింటెండెంట్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...