ఎంపీ వెంకట్‌రెడ్డికి ఘన సన్మానం


Sun,September 15, 2019 11:10 PM

ఆత్మకూరు(ఎం) : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డివెంకట్‌రెడ్డిని ఆదివారం ఆత్మకూరు(ఎం) మండలం కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మండల అభివృద్ధి కోసం నిధులు మంజూరి చేయాలని ఎంపీని కోరారు. మండల కేంద్రంలో మధ్యలో ఆగిపోయిన ఫంక్షహాల్ నిర్మాణం, బీసీ బాలికల వసతిగృహానికి ప్రహరీ, బీసీ కమ్యూనిటీహాల్, సీసీ రోడ్ల నిర్మాణం, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం డైనింగ్‌హాల్ ఏర్పాటు కోసం అధిక నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఎంపీని కలిసిన వారిలో కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి యాస లకా్ష్మరెడ్డి, జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్‌గుప్తా, ఆత్మకూరు(ఎం) సర్పంచ్ జెన్నాయికోడె నగేశ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎల్లంముల సంజీవరెడ్డి, దిగోజు నర్సింహాచారి, యూత్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...