పద్మశాలి ఉద్యోగుల ముగింపు సదస్సు విజయవంతం


Sun,September 15, 2019 11:10 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : గత రెండురోజులుగా యాదగిరిగుట్ట పట్టణంలో ని పద్మశాలి సత్రంలో జరుగుతున్న రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల ముగింపు సదస్సు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. వివిధ అంశాలపై ఆయా రంగాల్లో నిష్టాతులైన పద్మశాలి కుల బాంధువు వారి అభిప్రాయాలను సభ్యులకు తెలియజేశారు. ఇందులో భాగంగా మెడిటేషన్, సర్వీస్ రూల్స్, లీడర్‌షిప్ క్వాలిటీస్ వంటి విషయాలపై చర్చించారు. ప్రతి పద్మశాలి ఉద్యోగి ప్రతి సోమవారం తప్పనిసరిగా చేనేత దుస్తులు ధరించే విధంగా ప్రభుత్వం ఆదేశించిం ది, కావున ప్రతి పద్మశాలి ఉద్యోగి తప్పనిసరిగా ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని తీర్మానించారు. ఈ విధంగా పలు తీర్మానాలను ప్రతిపాదించగా పలువురు బలపర్చారు. కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించగా పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం ముఖ్యఅతిథిగా హాజరై పద్మశాలిల అభివృద్ధిపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో మృతి చెందిన పంచాయతీ కార్యదర్శి స్రవంతికి సంతాపం తెలియజేశారు. ఆ తరువాత పద్మశాలి ఉద్యోగ సంఘానికి సంబంధించి పలు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమం లో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జోగయ్య, నాయకులు కైరంకొండ సుధీర్, రాష్ట్ర కోశాధికారి నవీన్ రాజ్‌కుమార్, నరేందర్ పాల్గొనగా తీర్మానాలు ప్రతిపాదించినవారిలో సతీశ్‌కుమార్, వడ్లకొండ వెంకట్రావు, సత్యనారాయణ, వేణుగోపాల్, రమేశ్, జయప్రద, రాహుల్, భాస్కర్, రవిప్రకాశ్, లక్ష్మీపతి, పెండెం శ్రీనివాస్, మామిడాల రవి ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...