ప్రత్యేక పూజలు.. అన్నదానం


Sat,September 14, 2019 11:38 PM

బీబీనగర్: మండలంలోని బీబీనగర్, రాఘవాపురం, రహీంఖాన్‌గూడెం గ్రామాల్లో నెలకొల్పిన వివిధ గణనాథుల వద్ద జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి పింగళ్‌రెడ్డిలు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను వారు ప్రారంభించారు. రాఘవాపురంలో రాజీవ్‌గాంధీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.1.5లక్షలకు గ్రామానికి చెందిన బండారు ఆనంద్‌గౌడ్ లడ్డూను దక్కించుకున్నారు. మండలంలోని కొండమడుగులో జైస్వాగత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఎంపీపీని ఘనంగా సన్మానించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...