ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య


Sat,September 14, 2019 11:37 PM

భువనగిరి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి విద్యార్థ్ధులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫోసిస్, మమత ట్రస్టు, యువ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు శనివారం నోటు పుస్తకాలు అందజేసి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువటీం కన్వీనర్ రాజు ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. విద్యార్థ్ధులు దాతలు అందించే చేయూతతో అత్యుత్తమ ప్రతిభ కనబరచి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవాలన్నారు.

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం అందుబాటు లో నాణ్యమైన విద్య ఉందని ఈ సందర్భం గా ఆయన గుర్తు చేశారు. యువటీం కన్వీనర్ సూదగాని రాజు మాట్లాడుతూ సామాజిక సేవే లక్ష్యంగా యువటీం ముందుకు సాగుతుందన్నారు. నిరుపేద విద్యార్థ్ధులకు ఆర్థ్ధికంగా, అన్నివిధాలా యువటీం సేవా కార్యక్రమాలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యువటీం ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ జడల సమంత్, ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు దామోదర్‌రెడ్డి, శేషాచారి, శ్రీనివాస్‌రెడ్డి, అలీం, యువటీం సభ్యులు పొన్న వినోద్, పాండాల రమేశ్, కిషోర్, హరీశ్, మధు మనోజ్, అభిలాశ్ పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...