శిశు మరణాలను నియంత్రించాలి


Sat,September 14, 2019 11:37 PM

భువనగిరి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న రోటా వ్యాక్సిన్‌లను చిన్నారులకు వేయించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కకలెక్టర్ అనితారామచంద్రన్‌లు అన్నారు. శనివారం పట్టణంలో రోటా వ్యాక్సిన్ల పంపిణీని వారు ప్రారంభించి మాట్లాడారు. రోటా వైరస్‌పై విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టి శిశు మరణాలను నియంత్రించాలని కోరారు. ఏటా సంభవించే శిశు మరణాల నియంత్రణకు రోటా వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు. కింది స్థాయి ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉచితంగా అందించే మందులపై అన్నివర్గాల ప్రజలకు తెలియజెప్పేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పరిపూర్ణాచారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జయలక్ష్మి, పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పాపారావు, ఆరోగ్య అధికారులు సీహెచ్ సైదారెడ్డి, సత్యనారాయణ, మనోహర్, లీలావతి, శ్రీకాంత్, జమాల్‌షరీఫ్, సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...