ఆసుయంత్రాలతో ఖర్చు ఆదా


Sat,September 14, 2019 11:37 PM

భూదాన్‌పోచంపల్లి: చేనేతలో ఆసుయంత్రాలు వాడకం వల్ల ఖర్చు తగ్గి డబ్బులు ఆదా అవుతాయని, దీంతో చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు అధిగమించే అవకాశం ఉందని ఆసుయంత్రం సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం అన్నారు. శనివారం భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో 9 మంది చేనేత మహిళా కార్మికులకు తాను తయారు చేసిన ఆసు యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మల్లేశం సినిమాను చూసిన ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు చేనేత కార్మికులకు సహాయం చేసేందుకు ముందుకువచ్చారన్నారు. ఈ మేరకు రాఘవేంద్రరావు ఐదు ఆసు యంత్రాలకు అయ్యే ఖర్చులను అందించారన్నారు. అదేవిందగా మల్లేశం సినిమా హీరో ప్రియదర్శి కూడా ఓ రెండు యంత్రాలకు సహాయం అందించారని తెలిపారు. కోదాడలోని నిట్స్ కళాశాల యాజమాన్యంతో పాటు విద్యార్థులు ఆర్థిక సహాయం అందించడంతో మరో రెండు యంత్రాల తయారీకి వినియోగించనట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారికి ఆయన ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

రానున్న రోజుల్లో చేనేత కార్మికులకు ఆసు యంత్రాలు అందించడానికి చాల మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో వెయ్యి ఆసు యంత్రాలను చేనేత కార్మికులకు అందించడానికి ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఇందులో 50 శాతం తానా భరిస్తుండగా.. మరో 25శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. మిగిలిన 25 శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని కూడా త్వరలో పూర్తి చేసి అవసరమైన చేనేత కార్మికులకు అందజేస్తానన్నారు. చేనేత కార్మికులకు ఉత్పత్తి వేయం తగ్గించడం కోసం ఈ ఆసు యంత్రాలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఇక ఉత్పత్తి వ్యయం తగ్గితే వస్ర్తాల ఉత్పత్తి వ్యయం తగ్గి అందరికీ అందుబాటు ధరలో వస్ర్తాలను అందించగలుగుతామన్నారు. అప్పుడే ఈ పరిశ్రమ పదికాలాల పాటు నిలుస్తుందన్నారు. త్వరలో మార్కింగ్ మిషన్, టై మిషన్‌లను కూడా చేనేత పరిశ్రమలో వాడటానికి అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు కార్యాలయ ప్రతినిధి కౌంముది, కోదాడ నిట్స్ కళాశాల చైర్మన్ సత్యనారాయణ, పోచంపల్లి చేనేత నాయకులు చిక్క కృష్ణ, చింతకింది మల్లేశం, జోగు శ్రీనివాస్, సీత కృష్ణ, మిర్యాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...