30 రోజుల ప్రణాళికలతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి


Fri,September 13, 2019 11:52 PM

భువనగిరి, నమస్తేతెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల గ్రామ ప్రణాళికలతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ అన్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని హన్మాపురం, తాజ్‌పూర్, అనంతారం గ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రమేశ్‌తో కలిసి గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసుకున్న స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

మౌలిక వసతులను సమకూర్చుకుని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ సందర్భంగా వన నర్సరీలను పరిశీలించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్‌లు ఎడ్ల రాజిరెడ్డి, బొమ్మారపు సురేశ్, చిందం మల్లికార్జున్, ఎంపీటీసీ సభ్యులు సామల వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...