ఉపాధ్యాయుల చేతిలో భావితరాల నిర్మాణం


Fri,September 13, 2019 11:52 PM

వలిగొండ : భావితరాల నిర్మాణం ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని ఎంపీపీ నూతి రమేశ్ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో గురుపూజోత్సవం సందర్భంగా మండలంలోని 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్న ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, తల్లిదండ్రుల తర్వాత గురువుకు స్థానం కల్పించారన్నారు. ఉపాధ్యాయులకు గుర్రం సత్తిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ గుర్రం ఇంద్రసేనారెడ్డి సౌజన్యంతో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.జడ్పీటీసీ వాకిటి పద్మా అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనర్సింహ, మండల విద్యాధికారి పి.విజయరావు, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...