ఆటోను ఢీకొట్టిన కారు


Fri,September 13, 2019 11:52 PM

బీబీనగర్ : కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో నలుగురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలైన ఘటన బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరిలోని పత్తి కంపెనీలో పని చేస్తున్న కీసర మండలం దాయరకు చెందిన స్నేహలత, పగిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, బీబీనగర్ మండలం రంగాపురంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పద్మశ్రీ తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘట్‌కేసర్ వైపు వెళ్లే భువనగిరిలోని హన్మాన్‌వాడకు చెందిన సుఖేందర్ అనే వ్యక్తి ఆటోలో బయల్దేరారు. ఈ సమయంలో వెనకనుంచి కారు అదుపుతప్పి ఒక్కసారిగా ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తోపాటు అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్సై కిష్టయ్య గమనించి 108కు సమాచారం చేర వేసి అంబులెన్స్‌లో గాయపడ్డవారిని భువనగిరిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆటో డ్రైవర్ సుఖేందర్, ప్రయాణికురాలు పద్మశ్రీ పరిస్థితి విషమంగా ఉండటంతో మైరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...