పాఠశాలను పునరుద్ధరించాలి


Fri,September 13, 2019 11:51 PM

వలిగొండ : ఎర్రకాల్వ ప్రాథమిక పాఠశాలను పునరుద్దరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని దుప్పెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాదగోని శోభారాణి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పాఠశాలను మూసి వేయడం సరికాదన్నారు. దీంతో పక్క గ్రామానికి వెళ్లలేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. పాఠశాలను తిరిగి ప్రారంభిస్తే ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలకు వస్తారని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని విద్యాధికారులు వెంటనే పాఠశాలను తెరవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాదగోని వెంకటయ్య, బాలగోని సత్యనారాయణ, శంకరయ్య, రవి, అంజయ్య, ఉపేందర్, సుధాకర్‌రెడ్డి, గణేశ్, మధు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...