అద్భుత నిర్మాణాలతో యాదాద్రి కనువిందు


Fri,September 13, 2019 03:18 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం కనీవిని ఎరుగని రీతిలో అద్భుతంగా పునర్నిర్మాణం చేపట్టడం ఒక్క సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని, అద్భుత నిర్మాణాలతో యాదాద్రి కనువిందు చేస్తున్నదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయన తొలిసారి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపటడ్డం ఒక్క తెలంగాణకే కాదు యావత్ దేశంలోని భక్తులందరికీ సంతోషదాయకంగా మారిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ నిర్మాణం మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. ఇంతటి మహాకార్యానికి పూనుకున్న సీఎం కేసీఆర్‌కు ధన్యావాధాలు తెలిపారు. సీఎం సంకల్పించకుంటే ఇది ఎప్పటికీ సాధ్యమయ్యిండేది కాదని తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దేశానికి తలామానికంగా మారిందని తెలిపారు. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకునే సందర్శకులకు జీవితాలు పుణీతమవుతాయన్నారు. ప్రజలు, భక్తులు తరతరాలుగా ఈ ఆలయాన్ని గుర్తుపెట్టుకుంటారని, ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతిగా మిగిలుతుందన్నారు.

కేసీఆర్ సీఎం కాకపోతే అభివృద్ధి జరిగేది కాదు..
తెలంగాణ రాకపోతే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులేవి జరిగేవి కావని చెప్పారు. ముఖ్యగా యాదాద్రి అభివృద్ధిని చూసిన వారు కేసీఆర్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నారని చెప్పారు. కేసీఆర్ సీఎం కాకపోతే కనీసం యాదాద్రి ప్రత్యేక జిల్లా అయ్యేది కాదని చెప్పారు. యాదాద్రి ఆధ్యాత్మికతకు యాదాద్రి ఆలవాలం కానుందని చెప్పారు. పవిత్ర కార్యక్రమాలకు తలమానికమవుతుందని వివరించారు. సీఎం కేసీఆర్ చూపిస్తున్న చొరవ వల్ల యాదాద్రి తిరుమలకు దీటుగా తయారవుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

గుత్తాకు ఘనస్వాగతం..
చైర్మన్‌గా ఎన్నికయ్యాక మొదటిసారి యాదాద్రికి వచ్చిన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఘన స్వాగతం అందుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. ఆశీర్వచనం అనంతరం ఆయన హోటల్ హరితలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుత్తా పాత కాలం నాటి అనుచరులు పెద్ద ఎత్తున తరలిరావడంతో హోటల్ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ తరలివచ్చారు. మొట్టమొదటగా టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, భువనగిరి ఆర్‌డీవో వెంకటేశ్వర్లు, యాదాద్రి ఆలయ ఈవో ఎన్. గీత, ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐలు ఆంజనేయులు, నర్సింహారావు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పాల ఉత్పత్తి దారుల సంఘాల అధ్యక్షులు, మదర్ డెయిరీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...