ఆరోగ్య తెలంగాణ సాధించాలి


Fri,September 13, 2019 03:18 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
ఆలేరుటౌన్: ఆరోగ్య తెలంగాణ సాధనకు అందరు సహకరించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలేరు మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన పోషణ అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా ప్రజాసంక్షేమం కొసం అధిక నిధులు వెచ్చిస్త్తున్నదని అన్నారు. ఆడపడచులకు మరింత చేయూత నిచ్చి ఆరోగ్యమైన సంతానం పొందేందుకు మాతాశిశు సంరక్షణ చేపట్టిందనిన్నారు. అమ్మాయి గర్భం దాల్చింది మొదలు ఆశా, ఆరోగ్య కార్యకర్తల సహాయంతో టీకాలు, అంగన్‌వాడీ కేంద్రలో పోషకాహరం అందిస్తున్నదన్నారు. తల్లి ఆరోగ్యం కాదు బిడ్డ ఆరోగ్యం కూడా ముఖ్యమని వారికి ప్రతి పదిహేను రోజులకొకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అన్ని రకాలుగా అదుకుంటుందన్నారు. ఎత్తుకు తగిన బరువు, ఆరోగ్యంగా ఉండేందుకు వారికి అన్ని రకాలుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం చేశారు. జిల్లా వెల్ఫేర్ అధికారిణి కృష్ణవేణి, సీడీపీవో చంద్రకళ, ఏపీఎం మీనా, జడ్పీటీసీ డా.కె నాగేశ్, వైస్ ఎంపీపీ లావణ్య, ఎంపీపీ సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...