ఘనంగా గణేశ్ నిమజ్జనం


Wed,September 11, 2019 11:59 PM

-కళా బృందాల మధ్య గణనాథుడికి వీడ్కోలు
-గణేశుడి శోభాయాత్రలో పాల్గొన్నప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు

వలిగొండ : తొమ్మిది రోజులు భక్తుల చేత ఘనమైన పూజలు అందుకున్న గణనాథుడు భక్తజన కళా బృందాల మధ్య ఘనంగా వీడ్కోలు పలికారు. బుధవారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన శోభయాత్రను అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున్న ఊరేగింపుతోపాటు బాణాసంచా కాల్చుతూ, కోలాటాలు ఆడుతూ భక్తిపాటల పరవశ్యంలో భక్తుల చివరి పూజలు అందుకున్న గణేశుడు నిమజ్జనానికై తరలివెళ్లాడు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బచ్చు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బెలిదె శ్రీనివాస్, బెలిదె నాగేశ్, పట్టణ అధ్యక్షుడు గజ్జెల అమరేందర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అప్పిశెట్టి సంతోశ్, కార్యదర్శి సిహెచ్ హరిబాబు, సభ్యులు వాస శత్రయ్య, వెంకటేశ్వర్లు, బెలిదె కిషన్, ములుగు నర్సయ్య, గౌరిశెట్టి అశోక్, బెలిదె లక్ష్మీనర్సయ్య, గుండా చంద్రశేఖర్, డోగిపర్తి సంతోశ్, గజ్జెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
భువనగిరి అర్బన్ : వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని బహార్‌పేట్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ కులమతాలకతీతంగా వినాయక పండగను ఉత్సాహంగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జరుపుకోవాలన్నారు. అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు శోభాయాత్ర ముగిసే వరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్‌కుమార్, హంగీర్, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

వినాయక శోభాయాత్ర పాల్గొన్న
వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు
భువనగిరి అర్బన్ : వినాయక శోభాయాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మూసాపేట రామరాజు పట్టణంలోని హనుమాన్‌వాడ, ఉప్పలమ్మగుడి, నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని మహిళలకు మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట భానుప్రసాద్, జిల్లా కార్యదర్శులు పోల శ్రీనివాస్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దేవరకొండ నర్సింహాచారి, నాయకులు సుర్వి శ్రీనివాస్‌గౌడ్, సుర్వి లావణ్య, మనోజ్, సందీప్, సాయి పాల్గొన్నారు.

గణనాథుడి ఆశీస్సులు ఉండాలి..
బీబీనగర్ : ప్రతిఒక్కరికీ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి పింగళ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు అన్నారు. బీబీనగర్, కొండమడుగు గ్రామాల్లో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుల వద్ద బుధవారం వారు వేర్వేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో బీబీనగర్ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కాసుల ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీలు గోళి నరేందర్‌రెడ్డి, టంటం భార్గవ్, పలు యువజన సంఘాల యువకులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.
గణనాథుడికి గడసరి పూజలు..
భువనగిరి అర్బన్ : పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథులకు నవరాత్రులు ముగిడంతో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, చిన్నారులు బుధవారం గడసరి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పోయిరా గణపయ్య వెళ్లి రావయ్య... మల్లొచ్చె ఏడాది వరకు చల్లంగా చూడయ్య... అంటూ గణపతిని వేడుకున్నారు. పట్టణంలోని ఆర్‌బీ నగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి పూజలో సినీ నటుడు వెంకట్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మహిళలు, నాయకులు, భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...