మృతుల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ


Wed,September 11, 2019 11:55 PM

భు వనగిరి, నమస్తేతెలంగాణ : మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన నల్ల వెంకటేశ్, నల్ల భిక్షపతి, రేపాక సాలయ్య, నల్ల మల్లమ్మ ఇటీవల అనారోగ్యాలతో మృతి చెందారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన 4వ వార్డు సభ్యులు కంచి మహేశ్ మృతుల కుటుంబానికి 25 కిలోల చొప్పున సన్న బియ్యం బుధవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సురేశ్, ఉప్పలయ్య, మధు, నరేశ్, గణేశ్, నర్సింహ, రామచంద్రయ్య, రమేశ్, స్వామి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...