ఘనంగా వినాయక శోభా యాత్ర


Wed,September 11, 2019 11:54 PM

భువనగిరి, నమస్తేతెలంగాణ : భక్తిశ్రద్ధ మధ్య పట్టణంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కళాకారుల ఆటాపాటల సందడితో శోభాయాత్ర కనుల పండువగా సాగింది. పట్టణ శివారులో ఏర్పాటు చేసిన తీనం చెరువులో గణేశులను నిమజ్జనం చేశారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తాలో స్టేజీ ఏర్పాటు చేసి.. కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వాసవీ క్లబ్, తంగెళ్లపల్లి రవికుమార్, పచ్చలకట్ట సోమేశ్వర ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో పట్టణంలోని పలు కూడళ్లలో భక్తుల సౌకర్యార్థం ప్రసాద వితరణ, మంచినీళ్ల ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ రమేశ్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీసీపీ నారాయణరెడ్డి భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...