పశువులకు సక్రమించే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Wed,September 11, 2019 11:54 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : పశువులకు సంక్రమించే గాలికుంటు, బ్రూసెల్లిసిస్ వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి డాక్టర్ జీవీ రమేశ్ అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలంలోని రామాజీపేట గ్రామంలో యాదగిరిగుట్ట మండల పశువర్ధకశాఖ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారుల సహాకార సంఘం సహకారంతో నిర్వహించిన కృషి కల్యాణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

పశువులకు సంక్రమించే వాధ్యులు, కృత్రిమ గ్భధారణ వల్ల పాడి సంపదపై తీవ్ర నష్టం కలిగిస్తాయని వివరించారు. ఈ సందర్భంగా పశువులకు సంక్రమించే వ్యాధు లు, కృత్రిమ గర్భాధారణ పై అవగాహనతోపాటు మేలు రకపు పశువులు, పాడి రైతుల ఆర్థికాభివృద్ధిని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొగిలిపాక తిరుమల రమేశ్, పాల సంఘం చైర్మన్ పొతరాజు నర్సింహులు, డైరక్టర్ ఆరె సుభాశ్, పశువైద్యులు డాక్టర్ శ్రీకాం త్, శ్రీనివాస్, పండిత్, శాఖ సిబ్బంది, గోపాలమిత్ర, పశుమిత్ర, పాడి రైతులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...