గుత్తాకు కర్నె ప్రభాకర్ అభినందనలు


Wed,September 11, 2019 11:53 PM

యాదాద్రిభువనగిరిజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి చైరన్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ప్రజాస్వామ్య పునాదులు మరింత బలపడుతాయని శాసనమండలిలో ప్రభుత్వవిప్ కర్నె ప్రభాకర్ అన్నారు. బుధవారం గుత్తాసుఖేందర్‌రెడ్డి శాసనమండలిలో ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన దగ్గరు కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ యన మీడియాతో మాట్లాడారు. వార్డు సభ్యుడి గా ప్రస్థానం ప్రారంభించిన సుఖేందర్‌రెడ్డి ఎం పీగా ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు వారథిగా పని చేశారని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనకు కేసీఆర్ చేస్తున్న కృషిని శాసనమండలిలో వివరించాలంటే మండలి చైర్మన్ పాత్ర ఎంతో ఉంటుందని చెప్పారు. మండలిని సమర్ధవంతంగా నడపడం ద్వారా దేశంలోనే అత్యున్నతమైన సభను నడిపిన వ్యక్తిగా సుఖేందర్‌రెడ్డి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...