భవిష్యత్‌ తరాలకు ఐలమ్మ స్ఫూర్తిదాత


Tue,September 10, 2019 11:49 PM

ఆలేరుటౌన్‌ : భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాత ఐలమ్మ అని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి(చిట్యాల) ఐలమ్మ 34వ వర్ధంతి సందర్భంగా ఆలేరు మండల రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఎదు ట నిర్మించనున్న ఐలమ్మ విగ్రహానికి మంగళవా రం ఆమె శంకుస్థాపన చేశారు. ఇందిరా గాంధీ వాషర్‌మెన్‌ అధ్యక్షుడు ఆలేటి అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ సమాజంలో శుభాలకు సంకేతం అయిన చాకలి వృత్తిని పవిత్రకు చిహ్నమని, తాను మెదటిసారిగా ఎమ్మెల్యేగా నామినేషన్‌ సందర్భంగా ఉర్మిళ రజక వృత్తిదారుణి ఎమ్మెల్యేగా తప్పక ఎన్నిక అవుతావని ఆశీర్వదించిందని గుర్తు చేసుకున్నారు. అలాంటి వృత్తి లో జన్మించిన ఐలమ్మ నాటి భూస్వామ్యులకు, రజాకార్లకు సింహస్వప్నం అయిందని అన్నారు. అబల కాదు సబల అంటూ దొరల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి ఆమె పోరాట స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమాలకు అంకురార్పణ జరిగి రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆమె పోరాటాలు మన భవిష్యత్‌ తరాలకు జ్ఞాపకంగా ఉండేందుకు స్కూల్‌ ఎదుట ఏర్పాటు చేసి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. వృత్తినే దైవంగా స్వీకరించిన వృత్తిదారులకు ప్రభుత్వపరంగా అందే అన్ని సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈదమ్మ గుడి ప్రహరీ నిర్మాణానికి గతంలో నిధులు మంజూరు చేశామని, రజకవృత్తిదారుల సంఘం భవనానికి గతంలో మంజూరు అయిన నిధులను సమన్వయంతో సభ్యు లు భవనం నిర్మించుకోవాలని, నిరుపేద కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూంలను కేటాయిస్తామని, మోడ్రన్‌ వాషింగ్‌ మెషిన ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారులకు ఆమె స్వయంగా సన్మానం చేశారు.

రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే..
పట్టణంలోని వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి మార్గా న్ని ఎమ్మెల్యే పరిశీలించారు. గతంలో శిథిలమైన రోడ్లను ఎల్‌ టీ సహకారంతో మరమ్మతులు చేశారు. వర్షాలతో బస్టాండ్‌ సమీపంలో ఏర్పడిన గుంతలతో వాహనదారులు, పాదచారులు సతమవుతున్నారని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎల్‌టీ ప్రతినిధి ఉమచాంద్‌తో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడిన దృష్ట్యా వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. సాయిగూడెం, మందనపల్లి వెళ్లే జీడికల్‌ రోడ్డు బైపాస్‌ నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయాలని, బహుపేట బైపాస్‌ రోడ్డు వద్ద సర్వీస్‌రోడ్డు వద్ద మరమ్మతు పనులు రెండు నెలలోపు పూర్తిచేసి బస్‌బే నిర్మించాలని ఆయనకు సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో కేటీఆర్‌ మున్సిపల్‌శాఖ మంత్రిగా మున్సిపాలిటీలకు అభివృద్ధి నిధులు మంజూరు చేశారని ఎన్నికల అనంతరం అభివృద్థి పథంలో ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశామని, స్ట్రీట్‌లైట్‌ పనులకు శంఖుస్థాపన చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యేకు సన్మానాలు..
ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రెండవసారి ప్రభుత్వవిప్‌గా నియమితులైన సం దర్భంగా ఆమెకు పలువురు శాలువాలు కప్పి ఘనం గా సన్మానించారు. జిల్లా కురుమసంఘం అధ్యక్షుడు గవ్వల నర్సింహులు పూలమాలలు అందజేసి శాలువాలు కప్పారు. పత్రిక ప్రతినిధులు, రజకసంఘం నాయకులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గంగు ల శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ అధ్యక్షుడు ఆకవరం మెహన్‌రావు, పట్టణ అధ్యక్షుడు మోరిగాడి వెంకటేశ్‌, మండల మహిళ మాజీ అధ్యక్షురాలు గుత్తా శమంతకరెడ్డి, నాయకులు అడెపు బాలస్వామి, గవ్వల నర్సింహులు, వట్టిపల్లి మెగిలి మల్లేశ్‌, ఇల్లెందు మల్లేశ్‌, బెంజరపు రవి, పొరెడ్డి శ్రీనివాసు, పాశికంటి శ్రీనివాసు, చింతకింది మురళి, సందుల సురేశ్‌, పుట్ట మల్లేశ్‌, చిమ్మి శివమల్లు, బింగి రవి, పిక్క శ్రీను, సం దుల సురేశ్‌, జూకంటి ఉప్పలయ్య, పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, పూల శ్రావణ్‌, తాళ్లపల్లి మహేశ్‌, కూతాటి అంజన్‌కుమార్‌, ఎండీ రియాజ్‌, బెదరకోట దుర్గేశ్‌, విజయ్‌, కోనపురం నాగరాజు, రవినాయక్‌, దూడం మధు, దేవదానం, పూల నాగయ్య, సర్పంచ్‌ ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి , రజక సంఘం నాయకులు వడ్డెమాను శ్రీనువాస్‌, వడ్డెమాను కిషన్‌, ఆలేటి మల్లేశం, ముదిగొండ శ్రీ కాంత్‌, గోపరాజు రాంచంద్రం, తునికి శేఖర్‌, గోపరాజు సత్యనారాయణ, తునికి గణేశ్‌, వడ్డెమాను ఆశోక్‌, బాలయ్య, రామారావు, గడసంతల మధుసూదన్‌, తునికి రవికుమార్‌, ప్రదీప్‌, గుమ్మడి ఆంజనేయులు, తునికి దశరథ, ఆలేటి అనిల్‌కుమార్‌ తదితరులున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...