ముఖమండపంలోని మెట్ల వద్ద రెయిలింగ్‌ పనులు ప్రారంభం


Tue,September 10, 2019 11:49 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణలో భాగం గా దర్శనం చేసుకున్న భక్తులు బయటకు వెళ్లే దారిలో ఉన్న మెట్లకు రెయిలింగ్‌ను అమర్చే పనులను మంగళవారం ఆర్కిటెక్టు ఆనందసాయి, స్తపతి డాక్టర్‌ ఆనందార్యుల వేలు పరిశీలించారు. ముఖమండపంలో పచ్చిమ భాగంలోని మెట్ల వద్ద శిల్పులు ఈ పనులను నిర్వహిస్తున్నారు. కృష్ణశిలలతో రెయిలింగ్‌ను బెంగళూరులో తయారు చేయించి యాదాద్రికి తీసుకువచ్చారు. ఆలయ నిర్మాణంలోని ప్రతి కట్ట డం కృష్ణశిలలతో ఉండాలన్న సీఎం కేసీఆర్‌ సూచనలతో రెయిలింగ్‌ పనులను చేపట్టారు. రెయిలింగ్‌ కోసం సాధారణంగా ఇనుప కడ్డీలను, లేదా అల్యూమినియంతో చేసిన కడ్డీలను వాడుతారు. కానీ యాదాద్రి ఆలయానికి కృష్ణశిలలను వాడుతున్నారు.
ఇన్నర్‌ ప్రాకారంలో చేపడుతున్న ఫ్లోరింగ్‌ పనులను కూడా వారు పరిశీలించి నాణ్యతగా పనులు చేపట్టాలని కాం ట్రాక్టర్లకు సూచించారు. పనుల పురోగతిపై ఉప స్తపతులతో వారు ఈ సందర్భంగా సమీక్ష జరిపారు. ఉప స్తపతులు సంజ య్‌, చిరంజీవి ఆదిత్య, హేమాద్రి, గణేషన్‌, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...