ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి


Tue,September 10, 2019 11:49 PM

భువనగిరి అర్బన్‌ : పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని గంజ్‌ ప్రాంతంలో వివేకానందయూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి మంగళవారం ఆయన ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అదేవిధంగా హనుమవాన్‌వాడలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, భువనగిరి పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, జడ్పీటీసీ బీరుమల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మాల, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నువ్వుల ప్రసన్న, నాయకులు తంగళ్లపల్లి రవికుమార్‌, రమేశ్‌, పాండు, వివేకానంద యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...