చాకలి ఐలమ్మ జీవితం అందరికీ ఆదర్శం


Tue,September 10, 2019 11:48 PM

అడ్డగూడూరు : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర అందరికీ ఆదర్శప్రాయమని రజకసంఘం పట్టణ అధ్యక్షుడు సకినాల రవి అన్నారు.మండలకేంద్రం లో చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అమె చెరుగని ముద్ర వేశారని కొనియాడారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ వడకాల రణధీర్‌రెడ్డి,రజక సంఘం ఉపాధ్యక్షులు సకినాల వినోద్‌,సకినాల బాలరాజు,శ్రీను, కనకయ్య, మైసయ్య,సత్యనారాయణ నాయకులు పాండు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంఘం ఆధ్వర్యంలో ...
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు చిరస్మరణీయమని బీసీ రిజర్వేషన్‌ సాధనసమితి నియోజకవర్గ అధ్యక్షుడు తుప్పతి బీరప్ప అన్నారు.మండలకేంద్రంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మంగళవారం అమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో ఆసం ఘం మండలాధ్యక్షుడు నాగులపల్లి బీరప్ప,ఉపాధ్యక్షులు పూజారి సైదులు,నాయకులు నీరటి పరుశురాములు, మత్స్యగిరి,మురళి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధ్దంతి
చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : మున్సిపాలిటీ కేంద్రంలో రజక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని నినాధించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కానుగు బాలరాజు, కేతరాజు అచ్చ య్య, బాతరాజు సత్యం,సామకూర రాజయ్య, ఐతరాజు లింగస్వామి, బాతరాజు మల్లేశం, పాలమాకుల నర్సింహ, ఎలుకరాజు కోటయ్య, బాతరాజు దశరథ, నర్సింహ, కానుగు సతీశ్‌, శేఖర్‌, సామకూర యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ..
సంస్థాన్‌నారాయణపురం: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె చేసిన పోరాట పటిమలను గుర్తు చేశారు. కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు రాచకొండ రమేశ్‌బాబు, గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పల వెంకటేశం, ఉపాధ్యక్షుడు రాచకొండ చిన్న రమేశ్‌, కార్యదర్శి ఏపూరి వెంకటేశం, ఉప్పల శ్రీనివాసులు, ఏపూరి సతీశ్‌, ఉప్పల ముత్యాలు, లింగంపల్లి జంగయ్య, పొట్ల చిన్న గిరిబాబు, చిలకరాజు సత్తయ్య, వర్కుట్‌పల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...