నవగ్రహ విగ్రహాల ధ్వంసం


Tue,September 10, 2019 11:48 PM

భువనగిరి అర్బన్‌ : పట్టణంలోని ఖిల్లానగర్‌ సమీపంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ఆవరణ ఉన్న నవగ్రహ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. మంగళవారం దేవాలయంలో దర్శనానికి వెళ్లిన భక్తులు చూసేసరికి నవగ్రహ విగ్రహాలు, అందులోని శనేశ్వరుని విగ్రహం పూర్తిగా ధ్వంసం కావడంతో ఆందోళనకు గురైనారు. అనంతరం స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ సీఐ సురేందర్‌ ఘటనాస్థలానికి చెరుకుని ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తుల ఆధారాలు సేకరించడానికి డాగ్‌స్కాడ్‌ బృందంతో తనిఖీలు చేపట్టారు.

నిఘా వైఫల్యంతోనే జరిగింది : వీహెచ్‌పీ
నిఘా వైఫల్యంతోనే నవగ్రహ విగ్రహాలు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నల్లగొండ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనకు పోలీస్‌ శాఖ, దేవాదాయ శాఖల అధికారులే బాధ్యులని, వారి నిఘా లేకపోవడంతోనే ఇలా జరిగిందన్నారు. సంతోషిమాత దేవాలయం వాచ్‌మెన్‌ 6 నెలల నుంచి లేడని, దేవాలయ నిర్వహణపై అధికారులు కనీసం దృష్టి పెట్టలేదన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి తోట భానుప్రసాద్‌, వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శులు శ్రీనివాస్‌, నాయకులు శివ, వెంకటేశ్‌, నాగేందర్‌, పాండు, రాజు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...