ప్రభుత్వ విప్‌కు అభినందనలు..


Tue,September 10, 2019 04:14 AM

రాజాపేట : ప్రభుత్వ విప్‌గా రెండోసారి నియామకమైన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని సోమవారం రాజాపేట మండల టీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్ తన నివాసంలో ఆమెను కలిసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్ గుర్రం నర్సింహులు, మాజీ సర్పంచ్ రామిండ్ల నరేందర్, మండల యువజన మండలాధ్యక్షుడు నక్కిర్త కనకరాజు, మండల యువజన ప్రధాన కార్యదర్శి సంతోశ్‌గౌడ్, రాజు, బలరాం ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...