ప్రభుత్వ విప్‌కు శుభాకాంక్షల వెల్లువ


Tue,September 10, 2019 04:14 AM

ఆలేరుటౌన్ : ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రభుత్వ విప్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా టీఆర్‌ఎస్ ఆలేరు పట్టణ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమెను టీఆర్‌ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మెరిగాడి వెంకటేశ్, మదర్ డెయిరీ డైరెక్టర్ లింగాల శ్రీకర్‌రెడ్డి.. ఆమెకు పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ అడెపు బాలస్వామి, నాయకులు బీజని మధు, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌నకు సత్కారం..
యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : రెండోసారి ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి ఘన సన్మానం లభించింది. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామ, మండల టీఆర్‌ఎస్ నాయకులు, వార్డు సభ్యులు ప్రభుత్వ విప్‌ను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్ పూలెపాక అశోక్, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తోటకూరి మల్లేశ్, వార్డు సభ్యులు గంధమల్ల క్రిష్టవేణికుమార్, మండల ప్రధాన కార్యదర్శి ఎస్.గౌస్, మండల మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండీ హైమత్, నాయకులు మానుపాటి క్రిష్ణ, గ్రామ యూత్ అధ్యక్షుడు ఎండీ అన్వర్, పల్లె సురేందర్, పూలెపాక భిక్షపతి, వెంకటేశం, గడ్డం కిషన్, సిక స్వామి, గుండ్ల శ్రీకాంత్, ఎండీ అని, నాద నవీన్, కోరుకొప్పుల వెంకటేశ్ పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...