పిలాయిపల్లిలో కార్డెన్ సెర్చ్


Tue,September 10, 2019 04:14 AM

భూదాన్‌పోచంపల్లి : మండల పరిధిలోని పిలాయిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అన్ని కాలనీల్లో సుమారు 170 పోలీసు సిబ్బందితోపాటు ఒక ఏసీపీ ఐదుగురు సీఐలు, 9 మంది ఎస్సైలు పాల్గొని గ్రామాన్ని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికెళ్లి ఇంట్లో గ్యాస్ సిలిండర్‌తోపాటు అనుమానితుల వివరాలను సేకరించారు. అదేవిధంగా సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో 36 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, బొలోరో వాహనం, కారు, స్కూల్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఇక కిరాణం దుకాణాల్లో అక్రమంగా అమ్ముతున్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనపర్చుకోవడంతోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో సరైన పత్రాలులేని రెండు గ్యాస్ సిలిండర్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ నారాయణరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక శక్తులకు తావు ఇవ్వకుండా ఉంచేందుకు జిల్లాలో తరచూ కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు అతి దగ్గరలో ఉన్న ఈ గ్రామంలో టెక్స్‌టైల్స్ మిల్లుతోపాటు పలు క్రషర్స్ జోన్ ఉండటం వల్ల ఇక్కడ బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖాండ్, ఒరిస్సా రాష్ర్టాలకు చెందిన వ్యక్తులు పని చేస్తున్నారని చెప్పారు. వారిని ఆసరాగా చేసుకొని ఈ గ్రామంలోకి సంఘవిద్రోహ శక్తులు కూడా చొరబడే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటిని క్షుణంగా పరిశీలించి వాహనాల పత్రాలు పరిశీలించామని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి నూత వాహన చట్టం అమలు అవుతున్నందున గ్రామస్తులకు నూతన చట్టం గురించి వివరించామని తెలిపారు. గుట్కాలతోపాటు అమోనియం బై కార్బోనేట్ కల్లులో వాడే పదార్థాన్ని సీజ్ చేశామని తెలిపారు. గ్రామస్తులతో కూడా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, చౌటుప్పల్ రూరల్ సీఐ పార్థసారధి, చౌటుప్పల్ సీఐ వెంకటేశ్వర్లు, రామన్నపేట రూరల్ సీఐ శ్రీనివాస్, పోచంపల్లి ఎస్సై రాజుతోపాటు మొత్తం 170 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...