నిధులు పుల్‌


Sun,September 8, 2019 11:48 PM

-జిల్లాకు రూ.10 కోట్ల 24 లక్షల 18వేలు
-జనాభా ప్రాతిపదికన కేటాయింపు
-ఆమోదం పొందిన పనులకు ప్రాధాన్యం
-30 రోజుల ప్రణాళికలో వినియోగం
-గ్రామపంచాయతీలకు మహర్దశ
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : గ్రామాలను ప్రగతిపథంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. గ్రామ స్వరాజ్యం సాధించానే లక్ష్యంతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌తో పాటు మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. 30 రోజుల ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల అవసరాలు, గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను విడుదల చేశారు. పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయించారు. సాధారణ నిధుల నుంచి రూ. 4,10,88,000, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.6,13,30,000 నిధులు విడుదలయ్యాయి. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. 30 రోజుల తర్వాత జిల్లాలో ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందం పర్యటిస్తుంది. ప్రణాళికలో లోటుపాట్లు ఏమైనా ఉంటే ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.

గ్రామ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టి..
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వెచ్చించనున్నారు. జనాభా పెరుగుదల, అవసరాల దృష్ట్యా ప్రభుత్వం నుంచి అందిన నిధులు సరిపోని పక్షంలో ఆయా గ్రామాల్లో దాతల నుంచి విరాళాలు సేకరించి గ్రామ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంపై సంబంధిత కమిటీ సభ్యులు దృష్టి సారించారు. ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల నుంచి విరాళాల సేకరణతో పాటు గ్రామాల్లో ఉన్న వివిధ రకాల పన్నులను వసూలు చేసి గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులను అభివృద్ధి చేసే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు కదులనున్నారు. దీని కోసం ప్రతి కమిటీలో 15- 30 మంది వరకు సభ్యులు ఉండేలా ప్రతి గ్రామ పంచాయతీలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతాయుతంగా నిధులు ఖర్చు చేయాల్సిన అవశ్యకతను సీఎం కేసీఆర్‌ తన సందేశంలో స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి గ్రామాల్లో గుర్తించిన అభివృద్ధి పనులను ఆర్థిక క్రమ శిక్షణతో పూర్తి చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను ప్రభుత్వం ఆదేశించింది. విడుదలైన నిధులు, దాతల నుంచి సేకరించిన విరాళాలు, గ్రామ పంచాయతీ వసూలు చేసే పన్నులపై దృష్టి సారించి స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ పనులను పూర్తి చేయాలని సూచించింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణను ఇచ్చారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...