బ్రాహ్మణపల్లిని సందర్శించిన


Sun,September 8, 2019 11:46 PM

-స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కేంద్ర ప్రతినిధులు
గుండాల : స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అమలు ద్వారా పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పట్ల ప్రజలు ఏ స్థాయి మేరకు అవగాహన, ఆచరణ కలిగియున్నారో క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడం కోసం ఆదివారం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామాన్ని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ తనిఖీ బృందం పారిశుద్ధ్యంపై తనిఖీ నిర్వహించారు. బృందంలోని సభ్యుడు వి.నరేశ్‌ తనిఖీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బండారు సంధ్యశ్రీనివాస్‌, ఎంపీటీసీ పాయిలి కవితశ్రీనివాస్‌, ఎస్‌బీఎం అధికారులు ఆర్‌.కరుణాకర్‌, తనిఖీ బృందం సభ్యులు మమత, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, ఉప సర్పంచ్‌ సుధాకర్‌, వార్డు సభ్యులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...